Chandrababu: పవన్ కల్యాణ్ మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు: చంద్రబాబు

  • పవన్ పై వైసీపీ నేతల మాటల దాడి
  • స్పందించిన చంద్రబాబునాయుడు
  • చిత్తూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా విస్తృతస్థాయి  సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నాయకులపై మండిపడ్డారు. జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు పవన్ మనసు గాయపడేలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయితీలు చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ పైనా విరుచుకుపడ్డారు. అన్నా అంటూనే ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని గంగలో ముంచేశారని వ్యాఖ్యానించారు. జగన్ కు డబ్బు పిచ్చి వదలదని అన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టుగా జగన్ వైఖరి ఉందని, సాయంత్రం ఐదు గంటలైతే చాలు, వీడియో గేములు ఆడుకుంటూ కూర్చుంటున్నారని ఆరోపించారు. ప్రతి శుక్రవారం బోనులో నిలుచునే వ్యక్తి టీడీపీపై మాట్లాడడమా! అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Chandrababu
Pawan Kalyan
Telugudesam
Chittoor District
Jana Sena
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News