Lakshmi Parvathi: ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా లక్ష్మీపార్వతి నియామకం

  • ఉత్తర్వులు జారీచేసిన ఏపీ సర్కారు
  • వైసీపీలో మహిళా నేతగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీపార్వతి
  • తనదైన శైలిలో గళం వినిపించిన మహిళా నేత

వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతికి ఏపీ సర్కారు కీలక పదవి అప్పగించింది. లక్ష్మీపార్వతిని ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యావంతురాలైన లక్ష్మీపార్వతి ఈ పదవికి న్యాయం చేస్తారని భావిస్తున్నారు. లక్ష్మీపార్వతి వైసీపీలో చేరిన తర్వాత సమయానుకూలంగా తన గళం వినిపిస్తూ పార్టీ వర్గాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె శ్రమకు తగిన ప్రతిఫలం ఇప్పుడు దక్కినట్టు తెలుస్తోంది.

Lakshmi Parvathi
Telugu Academy
Andhra Pradesh
YSRCP
Jagan
  • Loading...

More Telugu News