Jagan: జగన్ అసమర్థతతో రిలయన్స్, అదానీ వంటి సంస్థలు బై బై ఏపీ అంటూ వెళ్లిపోతున్నాయి: లోకేశ్ విమర్శలు

  • సీఎం జగన్ పై లోకేశ్ ట్వీట్
  • కంపెనీలను తీసుకొచ్చేందుకు ఎంతో కష్టించామని వెల్లడి
  • సంస్థలు వెళ్లిపోతుంటే ఎంతో బాధగా ఉందన్న లోకేశ్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ అసమర్థత, అహంకారం కారణంగా రిలయన్స్, అదానీ వంటి అగ్రగామి కంపెనీలు బై బై ఏపీ అంటూ ఒకదాని వెంట ఒకటి రాష్ట్రం విడిచి వెళ్లిపోతున్నాయని తెలిపారు. ఆ ప్రముఖ పారిశ్రామిక సంస్థల వెంటపడి, వాటిని ఏపీకి తీసుకురావడానికి ఒప్పించడానికి ఎంతో కష్టపడ్డామని, ఇప్పుడా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంటే  బాధగా ఉందని లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.

Jagan
Nara Lokesh
Reliance
Adani
  • Loading...

More Telugu News