Pawan Kalyan: జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీని విస్తరిస్తున్నాం: పవన్ కల్యాణ్

  • కొత్త సభ్యుల పేర్లను కాసేపట్లో వెల్లడిస్తామన్న పవన్
  • ట్విట్టర్ లో వెల్లడి
  • నాదెండ్ల మనోహర్ చైర్మన్ గా కార్యకలాపాలు సాగిస్తున్న కమిటీ

ఏపీలో బలమైన రాజకీయ పక్షంగా ఎదగాలనుకుంటున్న జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీని విస్తరిస్తోంది ఈ మేరకు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.  కమిటీలో స్థానం సంపాదించుకున్న కొత్త సభ్యుల పేర్లను కాసేపట్లో ప్రకటిస్తామని తెలిపారు.

ఇక ఇప్పటికే నాదెండ్ల మనోహర్ చైర్మన్ గా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఇందులో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, నాగబాబు, తోట చంద్రశేఖర్, కోన తాతారావు, కందుల దుర్గేశ్, పాలవలస యశస్విని, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ముత్తా శశిధర్, భరత్ భూషణ్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh
  • Loading...

More Telugu News