ఆసక్తిని రేపుతున్న 'తిప్పరా మీసం' ట్రైలర్
"అందరూ నేను అర్థంకాని ఎదవనని అనుకుంటున్నారు .. ఎవడేమనుకుంటే నా కేంటి? .. నేను అనుకున్నదే చేస్తా" అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగ్, ఆయన పాత్ర స్వభావాన్ని చాటి చెబుతోంది. ఆయన తల్లి పాత్రలో 'రోహిణి' కనిపిస్తోంది. డిఫరెంట్ లుక్ తో .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో శ్రీవిష్ణు బాగా చేశాడనిపిస్తోంది. 'బ్రోచేవారెవరురా' తరువాత ఆయన నుంచి వస్తున్న ఈ సినిమా కూడా విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి.