Viral Videos: యూపీలో లెక్చరర్ ని కర్రలతో చితక్కొట్టిన విద్యార్థులు.. వీడియో వైరల్

  • విద్యార్థినులతో లెక్చరర్ అసభ్య ప్రవర్తన?
  • దాడి చేసిన వారిలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా..
  • దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

కళాశాలలో లెక్చరర్ ని కొందరు విద్యార్థులు వెంటాడి మరీ చితక్కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బల్కారాన్ పూర్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆదర్శ్ జనతా ఇంటర్ కళాశాలలో విద్యార్థినుల పట్ల లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు ఇలా దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది.

లెక్చరర్ పై దాడి చేసిన వారిలో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.  దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, విద్యార్థినులను విద్యార్థులు వేధిస్తుండడంతో లెక్చరర్ మందలించాడని ఈ నేపథ్యంలోనే విద్యార్థులు ఇలా ఆయనపై దాడి చేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Viral Videos
teacher
students
  • Loading...

More Telugu News