Jagan: జగన్‌ది తప్పటడుగుల సర్కార్‌: మాజీ డిప్యూటీ స్పీకర్‌ వేదవ్యాస్‌

  • అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి
  • సరైన సలహాలు ఇచ్చేవారు లేరనుకుంటా
  • సీఎస్‌ వ్యవహారం మరీ తీవ్రం

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ సర్కారు తప్పటడుగులతో ప్రయాణం చేస్తోందని, ఆయనకు సరైన సలహాలు ఇచ్చేవారు లేరనిపిస్తోందని మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ అన్నారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టలేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. ఇక, ఇటీవల జరిగిన సీఎస్‌ వ్యవహారం మరీ తీవ్ర పరిణామమన్నారు. అజయ్‌ కల్లాం లాంటి అనుభవజ్ఞులు పాలనా యంత్రాంగంలో ఉన్నా ఎందుకు ఫెయిలవుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

Jagan
buragadda vedavyas
govt
  • Loading...

More Telugu News