JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ అనుమానాస్పద మృతి!

  • జేసీ ఇంట్లో పనిచేస్తున్న హరి వరుణ్
  • ఆత్మహత్య చేసుకున్నట్టు ఫిర్యాదు
  • కేసును విచారిస్తున్న పోలీసులు

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న హరి వరుణ్ రెడ్డి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. గత కొన్నేళ్లుగా అతను జేసీ ఇంట్లో విధులను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. హరి వరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

JC Prabhakar Reddy
Hari Varun
Sucide
  • Loading...

More Telugu News