TSRTC: టీ అమ్ముకునైనా బతుకుతామన్న టీఎస్ ఆర్టీసీ మహిళా కార్మికులు... ఒక్క టీకి రూ. 200 ఇచ్చిన సీపీఐ నారాయణ!

  • కార్మికులు అధైర్య పడొద్దు
  • వరంగల్ లో కార్మికుల నిరసనలు
  • కార్మికులు ధైర్యంగా ఉండాలన్న నారాయణ

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఏ మాత్రమూ అధైర్య పడకుండా ఉద్యమం చేయాలని, వారికి తమ పార్టీ పూర్తి సహకారాన్ని అందిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. తమ నిరసనల్లో భాగంగా వరంగల్ జిల్లా హన్మకొండలో మహిళా కార్మికులు టీ తయారు చేసి, రోడ్లపై విక్రయించారు. వారి వద్దకు వచ్చి రూ. 200 ఇచ్చి టీ కొనుగోలు చేసి తాగిన నారాయణ, కార్మికులకు రావాల్సిన జీతాలను ప్రభుత్వం ఇవ్వకపోయినా, వారు టీ అమ్ముకుని అయినా జీవిస్తామని చెబుతున్నారని, వారిలోని ఆత్మస్థైర్యానికి ఇదే నిదర్శనమని అన్నారు.

TSRTC
Tea
CPI Narayana
  • Loading...

More Telugu News