Sucide: నొప్పి లేకుండా చనిపోవడంపై నాలుగు రోజుల పాటు వీడియోలు చూసి ఆత్మహత్య!

  • తూర్పు గోదావరి జిల్లాలో ఘటన
  • చాకుతో కోసుకుని ఆత్మహత్య
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

తాను చనిపోవాలని నిశ్చయించుకున్న ఓ యువకుడు, ఏ మాత్రం బాధ లేకుండా ప్రాణాలు తీసుకోవాలని భావించి, నాలుగు రోజుల పాటు యూ ట్యూబ్ వీడియోలు చూసి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట సమీపంలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, లెక్కల రామచంద్రుడు (35) అనే వ్యక్తి, గత నాలుగేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాష్ రూమ్ లోకి వెళ్లి, మెడ, చేతులపై చాకుతో కోసుకున్నాడు. ఆపై తీవ్ర రక్తస్రావమై అతను మరణించాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు అతని సెల్ ఫోన్ ను పరిశీలించగా, పెయిన్ లేకుండా మరణించడం ఎలాగన్న విషయమై, అతను నాలుగు రోజుల పాటు వీడియోలు చూసినట్టు తెలిసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపట్టారు.

Sucide
You Tube
Videos
Painless
  • Loading...

More Telugu News