Tirumala: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం... డిసెంబర్ వరకూ ఆన్ లైన్ కోటా విడుదల!
- ప్రతి శుక్రవారం నాడు 200 టికెట్లు
- మిగిలిన రోజుల్లో 500 టికెట్లు
- ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయం
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడుని దగ్గరి నుంచి దర్శనం చేసుకునే సౌలభ్యాన్ని కలిగించే శ్రీవాణి ట్రస్ట్ సేవలు ప్రారంభమయ్యాయి. దాతలు రూ. 10 వేలు చెల్లించి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ను పొందవచ్చు. గత నెలలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రాగా, ఇప్పుడు ఆన్ లైన్ లోనూ బ్రేక్ టికెట్ పొందే సౌకర్యం ప్రారంభమైంది.
డిసెంబరు 31వరకు ఆన్ లైన్ కోటాను విడుదల చేసినట్టు టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం నాడు 200 బ్రేక్ టికెట్లు, మిగిలిన రోజుల్లో 500 బ్రేక్ టికెట్ల చొప్పున అందుబాటులో ఉంచామని ఆయన అన్నారు. టీటీడీ అధికార వెబ్ సైట్ 'టీటీడీ సేవా ఆన్‌లైన్.కామ్' ద్వారా విరాళం అందించి, తాము కోరుకున్న తేదీన భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కు చేరుకుని బ్రేక్ దర్శనానికి వెళ్లవచ్చని ధర్మారెడ్డి తెలిపారు.