gollpudi maruthi rao: మీరు త్వరగా కోలుకోవాలి... నటుడు గొల్లపూడికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి పరామర్శ

  • చైన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గొల్లపూడి
  • ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న వెంకయ్య
  • చెన్నై పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతిరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గొల్లపూడి చికిత్స పొందుతున్నారు. చెన్నై పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు గొల్లపూడి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గొల్లపూడి మారుతిరావు వృద్ధాప్య కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

gollpudi maruthi rao
vice president
Venkaiah Naidu
visit chennai
Hospital
  • Loading...

More Telugu News