Revenue Staff: రెవెన్యూ ఉద్యోగులకు షాక్.. తీసుకున్న లంచం వెనక్కివ్వాలంటూ మహిళ గొడవ

  • యాదాద్రి జిల్లా గుండాలలో ఘటన
  • విజయారెడ్డి హత్యను నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగుల ఆందోళన
  • పాసు పుస్తకాల జాప్యంపై సిబ్బందిని నిలదీసిన మహిళ

రెవెన్యూ ఉద్యోగులకు ఓ మహిళ షాకిచ్చారు. తన వద్ద నుంచి తీసుకున్న లంచం సొమ్మును తిరిగి ఇవ్వాలని ఉద్యోగులను డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ గుండాలలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఇదే సమయంలో ఓ మహిళా రైతు అక్కడకు చేరుకున్నారు. పాసు పుస్తకాలను ఇవ్వడంలో కొనసాగుతున్న జాప్యంపై సిబ్బందిని నిలదీశారు. తన వద్ద నుంచి లంచంగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో, షాక్ కు గురైన రెవెన్యూ ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Revenue Staff
Women Farmer
Yadadri Bhuvanagiri District
  • Loading...

More Telugu News