Jana Sena: లాంగ్ మార్చ్ నేపథ్యంలో జనసేన నేతలపై పోలీసు కేసులు

  • విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహణ
  • పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆరోపణలు
  • సెక్షన్ 341, 353 కింద కేసులు నమోదు

విశాఖలో నవంబరు 3న లాంగ్ మార్చ్ నిర్వహించిన నేపథ్యంలో జనసేన పార్టీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో ఐదుగురు నేతలపై సెక్షన్ 341, 353 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సభావేదిక అంశంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్నది పోలీసు వర్గాల వాదనగా తెలుస్తోంది. సభ సందర్భంగా జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఘటనపైనా కేసు నమోదు చేశారు. కాగా తాము అనుమతి ఇచ్చిన ప్రదేశంలో కాకుండా జనసేన నాయకులు సభా వేదికను మరోచోట ఏర్పాటు చేయడం పోలీసులను ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది.

Jana Sena
Long March
Vizag
Police
  • Loading...

More Telugu News