RaghaVendra Rao: 'అన్నమయ్య' సినిమా సమయంలోనూ విమర్శలు తప్పలేదు: రాఘవేంద్రరావు

  • 'అన్నమయ్య'కథపై మొదటి నుంచి నమ్మకం ఉండేది 
  • ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు 
  • నాగార్జున ఎమోషనల్ అయ్యాడన్న రాఘవేంద్రరావు  

రాఘవేంద్రరావు సినిమాల్లోని పాటల్లో శృంగారం కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. అలాంటి రాఘవేంద్రరావు భక్తి చిత్రాల ద్వారా సైతం ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. 'అన్నమయ్య' సినిమాకి ముందు నేను చేసిన సినిమాలు వేరు. అందువలన 'అన్నమయ్య' సినిమా సమయంలో ఎక్కువగా విమర్శలు వినిపించాయి.

నాగార్జున అన్నమయ్య ఏంటి? మీసాలతో అన్నమయ్యగా కనిపించడం ఏంటి? సుమన్ వేంకటేశ్వర స్వామి ఏంటి? రమ్యకృష్ణ భక్తురాలిగా కనిపించడం ఏంటి? ఈ భక్తి చిత్రంలో మోహన్ బాబు ఏంటి? అనే కామెంట్లు వినిపించాయి. అయినా ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తారనే నమ్మకం నాకు వుంది. కథ విన్న నాగార్జున కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. 'ఈ సినిమాకి పేరే కాదు .. డబ్బులు కూడా వస్తాయి' అని చెప్పాడు. అలాగే ఆ సినిమా అన్నివిధాలా సంతృప్తిని కలిగించింది" అని చెప్పుకొచ్చారు.

RaghaVendra Rao
Ali
  • Loading...

More Telugu News