Kartarpur Corridor: పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక పాటలో పూనం కౌర్

  • ఈ నెల 9న కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం
  • అధికారిక పాటను విడుదల చేసిన పాక్ ప్రభుత్వం
  • పాటలో సిద్దూ, హర్ సిమ్రత్ కౌర్, పూనం కౌర్

భారతీయ సిక్కు యాత్రికుల కోసం కర్తార్ పూర్ కారిడార్ ను ఈ నెల 9వ తేదీన పాకిస్థాన్ అట్టహాసంగా ప్రారంభించబోతోంది. గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఈ కారిడార్ ను ప్రారంభిస్తోంది. పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఉన్న డేరా బాబా నానక్ విగ్రహం నుంచి పాకిస్థాన్ లోని కర్తార్ పూర్ లో ఉన్న దర్బార్ సాహిబ్ గురుద్వారా వరకు ఈ కారిడార్ ను నిర్మించారు.

ఈ నేపథ్యంలో, ఓ పాటను పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా దీన్ని విడుదల చేశారు. భారతీయ సిక్కు యాత్రికులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు ఈ పాట ఉంది. మధ్యలో తమ సంతోషాన్ని వెల్లడిస్తున్న సిక్కు ప్రజల వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.

ఇందులో కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రియ మిత్రుడైన నవజోత్ సింగ్ సిద్దూ, శిరోమణి అకాళీదల్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ లతో పాటు, సినీ నటి పూనం కౌర్ కూడా ఉన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News