Maharashtra: మహారాష్ట్ర సీఎం రేసులో శరద్ పవార్ లేరు: శివసేన

  • మహారాష్ట్రకు శివసేన నుంచే సీఎం 
  • శరద్‌ పవార్‌తో మాట్లాడాను
  • ఇతర పార్టీల నేతలతోనూ సంప్రదింపులు 

మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచుకోవాలంటూ బీజేపీ ముందు డిమాండ్ పెట్టిన శివసేన నేతలు.. మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతో వారు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

తమ రాష్ట్ర తదుపరి సీఎం శివసేన నుంచే ఉంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ మరోసారి అన్నారు. తమ రాష్ట్రంలో సీఎం రేసులో శరద్‌ పవార్‌ లేరని స్పష్టం చేశారు. తాను శరద్‌ పవార్‌తో మాట్లాడానని, అంతేగాక, ఇతర పార్టీల నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

Maharashtra
BJP
shiv sena
  • Loading...

More Telugu News