Sasikala: 'చిన్నమ్మ' శశికళ చుట్టూ బిగిసిన మరో ఉచ్చు
- బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద శశికళ ఆస్తుల జప్తు
- పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆస్తుల కొనుగోలు చేసినట్లు ఆరోపణలు
- చెన్నై, కోయంబత్తూరు, పుదుచ్చేరిలో తొమ్మిది చోట్ల ఆస్తులు
తమిళనాడు దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో రెండేళ్లుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో 'చిన్నమ్మ' శశికళ శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఆమె చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది. బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద ఆమె ఆస్తులను సంబంధిత అధికారులు జప్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆమె భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో చెన్నై, కోయంబత్తూరు, పుదుచ్చేరిలో తొమ్మిది చోట్ల ఆస్తులను జప్తు చేశారు. ఆమెకు చెందిన సుమారు 1600 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బినామీ చట్టం కింద జప్తు చేశారు. ఆమెకు చెందిన 10 సంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు.