neelam sahani: ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సాహ్ని?.. రెండో స్థానంలో ఉన్నా ఆమె వైపే ప్రభుత్వం మొగ్గు!

  • విజయసాయిరెడ్డితో కలిసి నిన్న అమరావతికి సాహ్ని
  • జగన్‌తో భేటీ, భోజనం
  • మొదటి స్థానంలో ఉన్న ప్రీతికి దక్కని అవకాశం?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ నేపథ్యంలో కొత్త సీఎస్ ఎవరన్న చర్చకు సమాధానం దొరికినట్టే కనిపిస్తోంది. ఏపీ క్యాడర్‌కు చెందిన నీలం సాహ్ని కొత్త సీఎస్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. సాహ్ని ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర సాంఘిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా ఉన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి సోమవారం మధ్యాహ్నం అమరావతి వచ్చిన సాహ్ని.. ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అనంతరం ఆయనతో కలిసి భోజనం చేసినట్టు తెలుస్తోంది.

నిజానికి సీనియారిటీ ప్రకారం చూస్తే 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి ప్రీతి సూదన్ ముందున్నారు. ప్రీతి సూదన్ ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. ప్రీతి సహా మరికొందరి పేర్లు సీఎస్ రేసులో వినిపిస్తున్నా ప్రభుత్వం మాత్రం రెండో స్థానంలో ఉన్న నీలం సాహ్ని వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

neelam sahani
Andhra Pradesh
IAS
AP CS
  • Loading...

More Telugu News