Andhra Pradesh: ఎన్నికల వేళ టీడీపీ ఓటమిని కోరుకున్న సీఎస్ కు ఈ ప్రభుత్వం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది: సోమిరెడ్డి

  • ఏపీ సీఎస్ ను బదిలీ చేసిన ప్రభుత్వం
  • టీడీపీ నేతల విమర్శనాస్త్రాలు
  • అంతా రివర్స్ అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యలు

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహారంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల కోడ్ వేళ టీడీపీ ఓటమి కోరుకున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇది అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. షోకాజ్ నోటీసు అందుకున్న అధికారి నోటీసు పంపిన అధికారిని బదిలీ చేయడం ఎక్కడా లేదని, వింతగా అనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో అంతా రివర్స్ అనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. సాధారణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర ముఖ్య కార్యదర్శులను, ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తాడని, కానీ ఈ ప్రభుత్వంలో ప్రతిదీ రివర్సేనని ఎద్దేవా చేశారు.

Andhra Pradesh
CS
YSRCP
Jagan
Telugudesam
Somireddy
  • Loading...

More Telugu News