Andhra Pradesh: ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సీఎస్ బదిలీ పరాకాష్ఠ: కన్నా

  • ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ
  • స్పందించిన రాష్ట్ర బీజేపీ చీఫ్
  • సీఎం చెప్పేవాటికి, చేసేవాటికి పొంతన లేదని వ్యాఖ్యలు

ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను సర్కారు హఠాత్తుగా బదిలీ చేయడం పట్ల రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సీఎస్ బదిలీ వ్యవహారం పరాకాష్ఠగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చెప్పేవాటికి, చేసేవాటికి పొంతన ఉండదని అన్నారు.

ఎంతో బాధ్యతగా పనిచేస్తున్న వ్యక్తిని బదిలీ చేయడం నియంతృత్వం కాక మరేంటి? అని ప్రశ్నించారు. అటు, టీడీపీ నేత అచ్చెన్నాయుడు కూడా సీఎస్ బదిలీపై ఘాటుగా స్పందించారు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించనందునే బదిలీ చేసినట్టు భావిస్తున్నామని తెలిపారు. సీఎస్ ఆకస్మిక బదిలీపై ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

Andhra Pradesh
CS
Kanna
BJP
YSRCP
Jagan
Telugudesam
  • Loading...

More Telugu News