IAS: మీ పుణ్యమా అని ఐఏఎస్ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది: సీఎం జగన్ పై వర్ల రామయ్య విమర్శలు

  • ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ
  • ట్విట్టర్ లో స్పందించిన వర్ల రామయ్య
  • ఏమి అవగాహన అంటూ వ్యంగ్యం

ఏపీలో సీఎస్ బదిలీ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. మీ పుణ్యమా అని ఐఏఎస్ అధికారుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. "సీఎం గారూ మీ పరిపాలన అగమ్యగోచరంగా ఉంది. ఓ విషయంలో తన కిందిస్థాయి అధికారికి సీఎస్ షోకాజ్ నోటీసులు ఇస్తే ఆ కింది స్థాయి అధికారిని మీరు రక్షిస్తూ సీఎస్ నే బదిలీ చేశారు. పాలనా యంత్రాంగానికి మీరు ఇస్తున్న సందేశం ఏమిటి? గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఏమి అవగాహన!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

IAS
Andhra Pradesh
Jagan
Varla Ramaiah
  • Loading...

More Telugu News