Pawan Kalyan: 'పవర్' ట్వీట్ కు కొనసాగింపుగా మరో ట్వీట్ చేసిన పూనమ్ కౌర్

  • ఆవేశం శక్తికి సూచిక కాదు అంటూ పూనమ్ వ్యాఖ్య
  • మండిపడిన పవర్ స్టార్ అభిమానులు
  • వారు పోరాడుతున్నది స్వేచ్ఛ కోసం అంటూ మరో ట్వీట్

కొంతకాలంగా టాలీవుడ్ భామ పూనమ్ కౌర్ చేస్తున్న ట్వీట్లు అటు పవన్ కల్యాణ్ కు మద్దతుగానో, లేక వ్యతిరేకిస్తున్నట్టుగానో అర్థంకాక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు! తాజాగా ఆమె "ఆవేశం శక్తికి సూచిక కాదు" (anger is not power) అనే అర్థం వచ్చేలా ఓ ట్వీట్  చేశారు. దీనిపై పవన్ వీరాభిమానులు తీవ్రంగా స్పందించి పూనమ్ పై విమర్శల వర్షం కురిపించారు. దాంతో ఈ టాలీవుడ్ బ్యూటీ తన ట్వీట్ కు కొనసాగింపుగా మరో ట్వీట్ చేశారు. "వారి పోరాటం వెనుక కారణం ఉంది. ద్వంద్వ ప్రమాణాలు లేని పోరాటం అది. వారు పోరాడుతున్నది రాజకీయ పదవుల కోసం కాదు, ప్రతి ఒక్కరి స్వేచ్ఛ కోసం" అంటూ పేర్కొన్నారు. మరి దీనిపై పవర్ స్టార్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి!

Pawan Kalyan
Poonam Kaur
Jana Sena
  • Loading...

More Telugu News