Ayodhya: త్వరలో అయోధ్య వివాదంపై తీర్పు... నెటిజన్లకు పోలీసుల హెచ్చరికలు

  • అయోధ్య వివాదంపై తీర్పుకు సుప్రీం సన్నాహాలు
  • ఇష్టంవచ్చినట్టు పోస్టులు పెడితే కఠినచర్యలు తప్పవన్న యూపీ పోలీసులు
  • సోషల్ మీడియాపై పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు

ఎన్నో దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య భూవివాదంపై మరి కొన్నిరోజుల్లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా వినియోగదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. అయోధ్య అంశంపై ఇతరుల మనోభావాలు గాయపడేలా అభ్యంతరకరమైన, వివాదాస్పదమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని శాంతిభద్రతలను దెబ్బతీస్తే అలాంటివారిని ఉపేక్షించబోమని, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని యూపీ డీజీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా సైట్లపై పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.

Ayodhya
Supreme Court
Uttar Pradesh
Police
  • Loading...

More Telugu News