Jagan: ఇసుక కొరతపై జగన్ స్పందన

  • 90 రోజులుగా ఊహించని విధంగా వరద వస్తోంది
  • 265 రీచ్ లలో 61 మాత్రమే పని చేస్తున్నాయి
  • టీడీపీ పాలనలో ఇసుక మాఫియా నడిచింది

ఇసుక కొరతపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 90 రోజులుగా ఊహించని విధంగా వరద వస్తోందని, అన్ని నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని 265 రీచ్ లలో కేవలం 61 మాత్రమే పని చేస్తున్నాయని తెలిపారు.

ఇసుక కోసం లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. గత టీడీపీ పాలనలో ఇసుక మాఫియా నడిచిందని... ఇసుక ఉచితం అని చెప్పి మాఫియాను నడిపించారని ఆరోపించారు. ఈ నెలాఖరులోగా ఇసుక సమస్య తీరుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఇసుక సమస్య తాత్కాలికమేనని అన్నారు. ప్రజలకు మేలు చేసేలా మార్గదర్శకాలను రూపొందించామని చెప్పారు.

Jagan
Sand
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News