China Jeeyar: ముస్లిం ఇంటికి వెళ్లి, ఆతిథ్యం స్వీకరించిన చినజీయర్ స్వామి

  • రంపచోడవరంలోని సాదిక్ ఇంటికి వెళ్లిన చినజీయర్ స్వామి
  • స్వామివారికి పాదపూజ చేసిన సాదిక్
  • పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు

ప్రముఖ ఆథ్యాత్మిక గురువైన చినజీయర్ స్వామి పరమత సహనాన్ని చాటి చెప్పారు. అన్ని మతాలు ఒకటేనని, అన్ని మతాల ప్రజలు సమానులేనని తన చర్యల ద్వారా ప్రజలకు హితబోధ చేశారు. ఓ ముస్లిం భక్తుడి ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ ఆతిథ్యాన్ని చినజీయర్ స్వీకరించారు.

 వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని సాదిక్ హుసేన్... చినజీయర్ స్వామివారి భక్తుడు. ఈ నేపథ్యంలో, ఆయన ఇంటికి చినజీయర్ వెళ్లారు. తమ ఇంటికి చినజీయర్ రావడంతో సాదిక్ కుటుంబీకులు మురిసిపోయారు. ఆయనకు పాదపూజ చేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన కుటుంబీకుల యోగక్షేమాలను చినజీయర్ అడిగి తెలుసుకున్నారు. చినజీయర్ స్వామి వచ్చారనే వార్తతో భారీ ఎత్తున భక్తులు అక్కడకు తరలి వచ్చారు. వారందరనీ స్వామి ఆశీర్వదించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News