i Phone5: 'ఐ ఫోన్‌ 5' వాడుతున్నారా...అది కాసేపట్లో మూగబోతోందని తెలుసా!

  • మధ్యాహ్నం 12.30 గంటలు డెడ్‌లైన్‌
  • ఆ తర్వాత చేతిలో ఫోన్‌ ఉన్నా నిరుపయోగమే
  • మీ ఫోన్‌ని ఏ అవసరానికి వినియోగించలేరు

ఐ ఫోన్‌ 5 వాడుతున్న వారికి ఆందోళన కలిగించే వార్త ఇది. మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత మీ చేతిలో ఐ ఫోన్‌ ఉన్నా ఏ ఒక్క అవసరానికి ఉపయోగపడదని ఫోన్‌ తయారీ కంపెనీ యాపిల్‌ తన వినియోగదారులను హెచ్చరించింది. అందువల్ల ఈలోగా వినియోగదారులంతా తమ ఫోన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌)ను తక్షణం అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. లేదంటే 12.30 గంటల తర్వాత ఫోన్‌లో ఏ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోలేరని, డేట్‌ అండ్‌ టైమ్‌ జీపీఆర్‌ లోకేషన్‌ కూడా అప్‌డేట్ కావని యాపిల్‌ సంస్థ తెలిపింది.

ఐఓఎస్‌ 10.3.4 ఓఎస్‌ను అప్‌డేట్‌ చేసుకోని యూజర్స్‌కు మాత్రమే ఈ సమస్య ఉంటుందని, అందువల్ల తక్షణం అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. అలాగే ఐఫోన్‌ 4, ఐపాడ్‌ మినీ, ఐపాడ్‌ 2, మూడో తరం ఐపాడ్‌ మోడల్స్‌ వాడుతున్న వారు ఐఓఎస్‌ 9.3.6ను అప్‌డేట్‌ చేసుకోవాలి.

లేదంటే ఈ డివైజ్‌లో జీపీఎస్‌ లొకేషన్‌ సర్వీసులు పనిచేయవని సంస్థ తెలిపింది. అయితే వైఫై ఫీచర్‌ ఉన్న ఐపాడ్‌ టచ్‌, ఐపాడ్‌ మోడల్స్‌తో ఎటువంటి ప్రభావం ఉండదని యాపిల్‌ సంస్థ తెలిపింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News