Maha Cyclone: కమ్ముకొస్తున్న 'మహా' తుపాను.. తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం

  • ఉత్తర కొంకణ్, పశ్చిమ మధ్య మహారాష్ట్ర ప్రాంతాలకు భారీ వర్ష సూచన
  • ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు బీభత్సం సృష్టించనున్న 'మహా' తుపాను
  • మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలంటూ ఆదేశం

ఇప్పటికే భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర అతలాకుతలమైంది. తాజాగా 'మహా' తుపాను కమ్ముకొస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొంకణ్, పశ్చిమ మధ్య మహారాష్ట్ర ప్రాంతాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం  భారీ వర్ష హెచ్చరికలను జారీ చేసింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని ఆదేశించింది. ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మహా తుపాను బీభత్సం సృష్టించబోతోందని... అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

తుపాను నేపథ్యంలో, నిన్న ఏడు షిప్పులు, రెండు ఎయిర్ క్రాఫ్ట్ లను ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దింపింది. ఇవి సముద్రంలో చక్కర్లు కొడుతూ... తక్షణమే సమీపంలో ఉన్న పోర్టులకు చేరుకోవాలంటూ మత్స్యకారులను అలర్ట్ చేశాయి.

Maha Cyclone
Maharashtra
Heavy Rains
  • Loading...

More Telugu News