YSRCP: మంత్రి పేర్ని నాని తనపై కక్ష సాధిస్తున్నారంటూ ఆర్ఎంవో విజయనిర్మల నిరాహార దీక్ష

  • మచిలీపట్నం జిల్లా ఆసుపత్రిలో విజయనిర్మల ఇన్‌చార్జి ఆర్ఎంవో
  • వైసీపీ నేతలు తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపణ
  • ఏకపక్షంగా విధుల నుంచి తొలగించారని ఆవేదన

ఏపీ మంత్రి పేర్ని నాని తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపిస్తూ మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇన్‌చార్జ్ ఆర్ఎంవో విజయనిర్మల నిరాహారదీక్షకు దిగారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ విభాగం నాయకులు తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని, దీనిపై స్పందించిన మంత్రి ఎటువంటి విచారణ లేకుండానే తనను ఏకపక్షంగా విధుల నుంచి తొలగించారని విజయ నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్షను విరమించబోనని అన్నారు. తాను ఏం తప్పు చేశానని తనపై మంత్రి కక్ష సాధిస్తున్నారో చెప్పాలని విజయ నిర్మల డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.

YSRCP
perni nani
RMO Vijaya Nirmala
machilipatnam
  • Loading...

More Telugu News