Jayarambabu: మాజీ ఎమ్మెల్యే చదలవాడ జయరాంబాబు కన్నుమూత
![](https://imgd.ap7am.com/thumbnail/tn-9bc6d0bc5162.jpg)
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జయరాంబాబు
- రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
- రేపు మధ్యాహ్యం గుంటూరులో అంత్యక్రియలు
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే చదలవాడ జయరాంబాబు (72) మృతి చెందారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి 1985, 1994లలో రెండుసార్లు కాంగ్రెస్ తరపున ఎన్నికైన జయరాంబాబు.. బీసీ కార్పొరేషన్ ఛైర్మన్‌గానూ పనిచేశారు. ఆయనకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చివరి వరకు ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు. రేపు మధ్యాహ్నం గుంటూరులో ఆయన అంత్యక్రియలు జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జయరాంబాబు మృతి విషయం తెలిసి నేతలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.