Chiranjeevi: బిగ్ బాస్-3: నీకూ నాకూ మాత్రమే తెలిసిన విషయం అంటూ తమన్నాతో వ్యాఖ్యానించిన చిరు.. కన్నీళ్లు పెట్టిన తమన్నా

  • బిగ్ బాస్-3 గ్రాండ్ ఫినాలే
  • చీఫ్ గెస్ట్ గా చిరంజీవి
  • కంటెస్టెంట్లతో సందడి చేసిన చిరు

బిగ్ బాస్ మూడో సీజన్ ఫైనల్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన హోస్ట్ నాగార్జునతో కలిసి ఏంతో సందడి చేశారు. కంటెస్టెంట్లతో మాట్లాడుతూ తనదైన శైలిలో హాస్యం పండించారు. అయితే ట్రాన్స్ జెండర్ తమన్నాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

"ఓ సమస్య వస్తే స్నేహాన్ని కూడా పక్కనబెట్టి నువ్వు ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తావో నాకు తెలుసు. ఓ సమస్యను నువ్వు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటావు" అని చిరంజీవి అంటుండగానే తమన్నా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. అసలు చిరు దేనిగురించి మాట్లాడుతున్నాడో అక్కడెవరికీ అర్థంకాలేదు. అయితే చిరంజీవి మళ్లీ అందుకుని, "ఏం జరిగిందో నీకూ నాకూ మాత్రమే తెలుసు, ఐ అప్రిషియేట్ యూ" అంటూ అభినందించేసరికి తమన్నా తీవ్ర భావోద్వేగాలకు లోనైంది.

Chiranjeevi
Bigg Boss
Tamanna
  • Loading...

More Telugu News