Pawan Kalyan: పవన్ కల్యాణ్ రెండున్నర కి.మీ నడుస్తూ లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

  • లాంగ్ మార్చ్ పేరుతో 1934లో చైనాలో పోరాటం జరిగింది
  • మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచారు
  • ఈ ఇసుక ఆందోళనను లాంగ్ మార్చ్ అంటున్నారేంటీ?

ఇసుక సమస్యతో ఏపీలో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని నిరసన తెలుపుతోన్న జనసేన పార్టీ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ లాంగ్ మార్చ్ ఉంటుంది. దాదాపు 2.5 కి.మీ.మేర  ఇది కొనసాగుతుంది. అయితే, దీనికి లాంగ్ మార్చ్ అంటూ పేరు పెట్టడంపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సెటైర్లు వేశారు.

'లాంగ్ మార్చ్ పేరుతో 1934 లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా విమోచన సైన్యం మావో నాయకత్వంలో పది వేల కిలోమీటర్లు నడిచి అధికారం సాధించింది. రెండున్నర కిలోమీటర్లు నడిచే కార్యక్రమాన్ని చేపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఈ ఇసుక ఆందోళనను లాంగ్ మార్చ్ అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు' అని విజయ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Pawan Kalyan
vijaya saireddy
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News