BJP: కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి : టీ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌

  • మా పార్టీపై కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా
  • ఆయన తీరువల్లే కార్మికుల ఆత్మహత్యలు
  • కేంద్ర హోం మంత్రి దృష్టికి ఆయన నియంతృత్వ పోకడలు

ఓ రాష్ట్ర ముఖ్యమంత్రినని మర్చిపోయి నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఆయన పోకడలను త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకువెళ్తానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. నిన్న కేసీఆర్‌ బీజేపీపై చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్‌ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన ఓ చానెల్‌ ప్రతినిధితో మాట్లాడారు. తమ ఎంపీలను విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. కేసీఆర్‌ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదన్నారు.  ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎంగా కేసీఆర్‌ చేస్తున్న బెదిరింపులే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని కేంద్ర చట్టంలో లేదని, డెడ్‌లైన్‌ విధించడమంటే ఆర్టీసీ కార్మికులను బెదిరించడమేనన్నారు.

BJP
laxman
KCR
TSRTC
  • Loading...

More Telugu News