Telangana: కార్మికులు విధుల్లో చేరొచ్చు.. ఇబ్బందులకు గురిచేసే వారిపై క్రిమినల్ చర్యలు: పోలీసుల హెచ్చరిక

  • రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటనలు
  • విధుల్లో చేరే వారికి పూర్తి భద్రత కల్పిస్తాం
  • బెదిరింపులకు పాల్పడితే పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయొచ్చు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విధుల్లో చేరే కార్మికులకు పూర్తి భద్రత కల్పిస్తామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఈ రోజు మీడియాకు తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం చట్టరీత్యా నేరమని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. విధులకు ఆటంకాలు కలిగిస్తూ ఇబ్బందులకు గురిచేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. విధుల్లో చేరే వారికి పూర్తి భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ... సైబరాబాద్ సీపీ పరిధిలో విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న కార్మికులకు పోలీసులు భద్రత కల్పిస్తారని చెప్పారు. ప్రభుత్వ పిలుపుమేరకు సిబ్బంది నిర్భయంగా విధుల్లో చేరవచ్చని చెప్పారు. తమపై ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయొచ్చని చెప్పారు. ఆర్టీసీ సిబ్బందిని బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News