health: బోలు ఎముకల వ్యాధికి గురవుతోన్న యువత

  • వృద్ధుల్లో కనబడే బోలు ఎముకల వ్యాధి
  • ఆధునిక జీవన విధానంతో యువతలో అధికమవుతున్న వ్యాధి
  • డీ విటమిన్, కాల్షియం అందకపోవడమే కారణం

వృద్ధుల్లో కనబడే ఆస్టియోపోరోసిస్‌ (బోలు ఎముకల వ్యాధి) వ్యాధి ఇప్పుడు యువతకు కూడా అధికంగా వస్తోందని పరిశోధకులు గుర్తించారు. ఆధునిక జీవన విధానం వల్ల దైనందిక జీవితంలో చోటు చేసుకుంటున్న మార్పులే ఇందుకు కారణమని చెప్పారు.

భారత్ లోని యువతకు డీ విటమిన్, కాల్షియం అందకపోవడంతో ఈ వ్యాధి బారిన పడుతున్నారని పరిశోధకులు తెలిపారు. ఉదయాన్నే శరీరం మీద ఎండ పడేలా తిరిగితే  ‘డీ’ విటమిన్‌ పొందవచ్చు. అలాగే, పాల ఉత్పత్తులు తీసుకుంటే  కాల్షియం అందుతుంది. ఈ రెండింటికీ యువతలో చాలా మంది దూరంగా ఉంటున్నారని పరిశోధకులు గుర్తించారు. దీని వల్ల మోకాళ్లు, కీళ్ల నొప్పుల వ్యాధులకు గురవుతున్నారని వివరించారు.

health
India
  • Loading...

More Telugu News