Pawan Kalyan: కార్మికుల బాధలు చూడలేకే లాంగ్ మార్చ్ కు పిలుపు: జనసేన నేత నాదెండ్ల మనోహర్

  • భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
  • ఇసుక కొరతపై జనసేన పోరాటం
  • రేపు విశాఖలో లాంగ్ మార్చ్

గత ప్రభుత్వం హయాంలో అనుసరించిన ఇసుక పాలసీలను విమర్శించిన జగన్, వైసీపీ అధికారంలోకి రాగానే ఇసుక సరఫరా ఆపేశారని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల బాధలు చూడలేకే తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రేపు విశాఖలో ‘లాంగ్ మార్చ్’ ర్యాలీ చేపట్టనున్నారని చెప్పారు. లాంగ్ మార్చ్ లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  

ఈరోజు ఆ పార్టీ నేతలు వీవీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్ లతో కలసి నాదెండ్ల మీడియా ముందుకు వచ్చారు. ఇసుక విధానంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరివల్లే రాష్ట్రంలోని 50 నుంచి 70 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

Pawan Kalyan
Nadendla Manohar
VV Lakshminarayana
Jana Sena
  • Loading...

More Telugu News