Telugudesam: టీటీడీపీ ఉపాధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ పార్టీకి గుడ్ బై

  • బీజేపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే
  • కుమారుడు మల్లికార్జున్ కూడా తల్లి బాటలోనే
  • బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న తల్లీతనయులు 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో టీడీపీ ఉనికి ప్రమాదంలో పడింది. పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకురాలు ఏలేటి అన్నపూర్ణమ్మ పార్టీని వీడారు. త్వరలో ఆమె బీజేపీలో చేరనున్నారు.  పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర ఉపాద్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు.

1994, 2009లలో ఆమె ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పోటీచేయలేదు. కాగా, బాల్కొండ నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జీగా పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్  కూడా తన పదవిని వీడారు. ఈరోజు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో తన తల్లితో కలిసి ఆయన బీజేపీలో చేరనున్నారు.

Telugudesam
Telugudesam
Telangana
Annapurna
  • Loading...

More Telugu News