Kanna Babu: ఇసుక కొరతపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి: ఏపీ మంత్రి కన్నబాబు

  • వరద ఉద్ధృతి కారణంగా ఇసుక కొరత ఏర్పడింది నిజమే
  • రాజకీయ లబ్ధికోసమే లోకేశ్, పవన్ దీక్షలు
  • చంద్రబాబు తన హయాంలో భవన నిర్మాణ కార్మికుల కష్టాలు పట్టించుకోలేదు

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరతపై ప్రతి పక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, వరద ఉద్ధృతి వల్ల కొంతవరకు ఇసుక కొరత ఏర్పడిందని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గుంటూరు జిల్లా, తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. విపక్ష సభ్యులు చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటూ దీక్షలు చేస్తున్నారని ఆరోపించారు.

 మొన్న లోకేశ్ దీక్ష చేయగా, రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దీక్ష చేయనున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తూ, రాజకీయ లబ్ధికోసమే దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికుల కష్టాలను పట్టించుకోలేదన్నారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ కు కూడా వారి ఇబ్బందులు కనిపించలేదా? అని ప్రశ్నించారు.

Kanna Babu
Sand
Andhra Pradesh
Chandrababu
  • Loading...

More Telugu News