Chandrababu: జగన్ పై ఆరోపణలు మాత్రమే ఉన్నాయి.. ఆయన నేరస్తుడు కాదు: సి.రామచంద్రయ్య

  • అనేక కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారు
  • ఓడిపోయామన్న బాధ కూడా ఆయనలో లేదు
  • పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక నేరస్తుడు కాదని వైసీపీ నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఆయనపై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని... అనేక కేసుల్లో ఆయన స్టేలు తెచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయామనే బాధ కూడా చంద్రబాబుకు లేదని విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేయాలనుకుంటున్న కార్యక్రమాలను జనసేనాని పవన్ కల్యాణ్ నెత్తిన వేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని చిల్లర పార్టీలు మాత్రమే చంద్రబాబుకు మద్దతిస్తున్నాయని అన్నారు.

Chandrababu
Pawan Kalyan
Jagan
c ramachandraiah
Telugudesam
YSRCP
Janasena
  • Loading...

More Telugu News