Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమానులకు పండగే.. సినిమా చేస్తున్నారంటూ గుడ్ న్యూస్ చెప్పిన తరణ్ ఆదర్శ్

  • బోనీ కపూర్, దిల్ రాజు నిర్మాతలుగా 'పింక్' రీమేక్
  • పవన్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన చేసిన తరణ్ ఆదర్శ్
  • 'అజ్ఞాతవాసి' తర్వాత పవన్ నటించనున్న సినిమా ఇదే

రాజకీయాల నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉన్న జనసేనాని పవన్ కల్యాణ్... త్వరలోనే కొత్త సినిమా చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో, పవన్ అభిమానులకు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ గుడ్ న్యూస్ చెప్పారు. పవన్ కల్యాణ్ సినిమా తెరకెక్కబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించారు.

'బిగ్ న్యూస్. తమిళంలో బాలీవుడ్ సినిమా 'పింక్'ను రీమేక్ చేసిన బోనీ కపూర్... ఇప్పుడు దిల్ రాజుతో చేతులు కలపారు. 'పింక్'ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించబోతున్నారు. 'అజ్ఞాతవాసి' తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే' అంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తరణ్ చేసిన ట్వీట్ తో పవన్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

Pawan Kalyan
New Movie
Pink
Remake
Telugu
Tollywood
Boney Kapoor
Dil Raju
Taran Adarsh
  • Loading...

More Telugu News