Chandrababu: పాలకుల బాధ్యతారాహిత్యానికి ఇంకెంత మంది బలి కావాలి?: చంద్రబాబు

  • నాగరాజు ఉరి వేసుకోవడం కలచి వేస్తోంది
  • వారం వ్యవధిలో 10 మంది ప్రాణాలు వదిలారు
  • ఆదుకోవాల్సిన పాలకులు అపహాస్యం చేస్తున్నారు

ఏపీలో మరో భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీపై ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీ మరో కార్మికుడి ప్రాణాన్ని బలిగొందని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు లేక గుంటూరు ఉండవల్లి సెంటర్ లో నాగరాజు అనే తాపీమేస్త్రి ఉరి వేసుకోవడం కలచి వేస్తోందని చెప్పారు. వారం రోజుల వ్యవధిలోనే 10 మంది ప్రాణాలు వదిలారని అన్నారు. ఆదుకోవాల్సిన పాలకులు అపహాస్యం చేస్తున్నారని... ఇది అమానుషమని మండిపడ్డారు. పాలకుల బాధ్యతారాహిత్యానికి ఇంకెంత మంది బలి కావాలని ప్రశ్నించారు.

Chandrababu
Telugudesam
YSRCP
Sand
Suicide
  • Loading...

More Telugu News