MP sanjaykumar: తెలంగాణ పోలీసులపై పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్‌ పెడతా: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌

  • ప్రజాప్రతినిధినైన తనపై దౌర్జన్యం చేయడంపై ఆగ్రహం
  • వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరిక
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల నేపధ్యంలో నిర్వహించిన శాంతి యాత్రలో ఘటన

నిన్న కరీంనగర్ లో ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంతిమ యాత్రలో పాల్గొన్న తనను అడ్డుకోవడమేకాక, తనపై దౌర్జన్యం కూడా చేసిన పోలీసు అధికారులపై పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్‌ పెట్టనున్నట్లు బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. అప్రజాస్వామికంగా వ్యవహరించిన పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

టీఎస్‌ ఆర్‌టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ రోజు కరీంనగర్‌లో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఎంపీ సంజయ్ స్పందిస్తూ, పోలీసుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రతినిధినైన తన కాలర్‌ పట్టుకోవడం అంటే ప్రజల కాలర్‌ పట్టుకున్నట్టేనని అన్నారు. ఇంత జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అందుకే పోలీసు అధికారులపై ప్రివిలేజ్ మోషన్ పెట్టనున్నట్లు తెలిపారు.

MP sanjaykumar
karimnagar
Police
prviligemotion
  • Loading...

More Telugu News