Budda Venkanna: ప్రసంగాన్ని తప్పులు తప్పులుగా చదివిన జగన్.. వీడియో పోస్ట్ చేసి, ఎద్దేవా చేసిన బుద్ధా వెంకన్న

  • రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన జగన్
  • పలు పదాలను సరిగా చదవలేకపోయిన సీఎం
  • చూసి కూడా చదవలేనివాడిని ముద్దపప్పు అనే కదా అంటారన్న వెంకన్న 

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను నిన్న విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, ప్రసంగ పాఠాన్ని చదువుతూ పలు పదాలను ఆయన తప్పులతడకగా ఉచ్చరించారు. ఈ వీడియోను టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్లో షేర్ చేశారు. జగన్ ను ఉద్దేశిస్తూ విజయసాయిరెడ్డిపై సెటైర్లు వేశారు.

''నిరా రక్షత' అంటే నిరక్షరాస్యత, 'దీవితాన్ని పణంగా' అంటే జీవితాన్ని పణంగా, 'సంఘ సస్కర్తలు' అంటే సంఘ సంస్కర్తలు కాబోలు. ఆ 'రాజిక సౌద్దన్నాన్ని' అనేది మాత్రం అర్థం కాలేదు. మీకు అర్థమయితే చెప్పండి వీసారెడ్డి గారూ' అంటూ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు.

మీ ముఖ్యమంత్రి జగన్ హీరోయిన్ల పేర్లు చదువుతున్నారేంటి? ఓహో... నిరక్షరాస్యతకు వచ్చిన పాట్లా ఇవి అంటూ వెంకన్న సెటైర్ వేశారు. చూడకుండా ప్రసంగించే వ్యక్తి తప్పు మాట్లాడినప్పుడు 'పప్పు' అంటూ మీరు సంబరపడ్డారని... చూసి కూడా చదవలేనివాడిని ఏమంటారు విజయసాయిరెడ్డిగారూ... ముద్దపప్పు అనే కదా అంటారు అంటూ ఎద్దేవా చేశారు.

Budda Venkanna
Jagan
Speech
Vijayasai Reddy
  • Error fetching data: Network response was not ok

More Telugu News