Lakshman: ఢిల్లీ నుంచి పిలుపు.. హుటాహుటిన బయల్దేరిన లక్ష్మణ్

  • ఆర్టీసీ సమ్మెపై ఆరా తీస్తున్న బీజేపీ
  • ఎంపీ బండి సంజయ్ పై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆరా
  • కేంద్రానికి నివేదికను సమర్పించనున్న లక్ష్మణ్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ కు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో... హుటాహుటిన ఆయన ఢిల్లీకి బయల్దేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్మణ్ కలవనున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెపై నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ అధిష్ఠానం ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే, లక్ష్మణ్ ను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీకి బయల్దేరే ముందు లక్ష్మణ్ ను టీజేఎస్ అధినేత కోదండరామ్, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి కలిశారు. కార్మికుల సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

Lakshman
BJP
RTC Strike
Delhi
Amit Shah
  • Loading...

More Telugu News