Dil Raju: ప్రభాస్ పైనే దృష్టి పెట్టిన దిల్ రాజు!

  • నిర్మాతగా దిల్ రాజుకి మంచి పేరు 
  • వచ్చే ఏడాదిలో పెద్ద సినిమాల నిర్మాణం
  • ప్రభాస్ డేట్స్ కోసం ప్రయత్నాలు

ఫిల్మ్ నగర్లో ఇప్పుడు ఎక్కడ విన్నా దిల్ రాజుకి సంబంధించిన ఒక వార్త షికారు చేస్తోంది. ప్రభాస్ తో భారీ సినిమాను నిర్మించాలనే ప్రయత్నంలో దిల్ రాజు ఉన్నాడనేది ఆ వార్త సారాంశం. హిందీలో భారీ విజయాన్ని నమోదు చేసిన 'పింక్' సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ తో రీమేక్ చేయడానికి కొన్ని రోజులుగా దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు.

త్రివిక్రమ్ ద్వారా పవన్ ఈ ప్రాజెక్టు పట్ల ఆసక్తిని చూపేలా చేయడంలో దిల్ రాజు  కొంతవరకు సక్సెస్ అయ్యాడని చెప్పుకుంటున్నారు. అదే విధంగా ప్రభాస్ తో ఒక భారీ చిత్రాన్ని నిర్మించాలనే దిశగా కూడా ఆయన పావులు కదుపుతున్నాడని అంటున్నారు. వచ్చే ఏడాదిలో పెద్ద సినిమాలు చేయాలనే నిర్ణయం తీసుకున్న కారణంగానే దిల్ రాజు ఆ దిశగా అడుగులు వేస్తున్నాడని చెబుతున్నారు. ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి మరి.

Dil Raju
Prabhas
pavan
  • Loading...

More Telugu News