Pakistan: ఇమ్రాన్ ఖాన్ కు షాక్.. కశ్మీర్ ను సమస్యగా చూస్తున్న పాకిస్థాన్ ప్రజలు 8 శాతం మందే!

  • 'గాలప్ ఇంటర్నేషనల్' సంస్థ నిర్వహించిన సర్వేలో బయటపడ్డ వాస్తవాలు
  • ఆర్థిక సంక్షోభమే పెద్ద సమస్య అన్న 53 శాతం మంది ప్రజలు
  • ఇమ్రాన్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు 8 శాతం మాత్రమే

ఇంతకాలం కశ్మీర్ అంశాన్ని బూచిగా చూపుతూ రాజకీయంగా పబ్బం గడుపుకున్న అక్కడి పార్టీలకు, సైన్యానికి పాకిస్థాన్ ప్రజలు షాక్ ఇచ్చారు. తమ సమస్య కశ్మీర్ కానేకాదని వారు తేల్చి చెప్పారు. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, దేశ ఆర్థిక వ్యవస్థనే తమ సమస్య అని తెలిపారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో అక్కడి మెజార్టీ ప్రజలు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సర్వేను 'గాలప్ ఇంటర్నేషనల్' అనే సంస్థ నిర్వహించింది.

దేశ ఆర్థిక సంక్షోభమే పెను సమస్య అని 53 శాతం మంది పాక్ ప్రజలు తెలిపారు. రాజకీయ అస్థిరతపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 8 శాతం మంది ప్రజలు మాత్రమే కశ్మీర్ ను ఒక సమస్యగా చూస్తుండటం గమనార్హం. మరోవైపు, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ రాద్ధాంతం చేస్తున్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి కేవలం 8 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఇది ఇమ్రాన్ కు షాకిచ్చే అంశమే.

Pakistan
Gallup International
Survey
Kashmir
  • Loading...

More Telugu News