Donald Trump: ఐసిస్ కు కొత్త నాయకుడు వస్తున్నాడట... అతడెవరో మాకు తెలుసు: ట్రంప్

  • అమెరికా దాడుల్లో ఐసిస్ చీఫ్ బాగ్దాదీ హతం
  • ఐసిస్ కొత్త నాయకుడిగా అల్ ఖురేషీ నియామకం
  • ట్విట్టర్ లో స్పందించిన ట్రంప్

ఇటీవలే ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైన సంగతి తెలిసిందే. అమెరికా దళాల దాడులకు భయపడిన బాగ్దాదీ తనను తాను పేల్చుకున్నాడు. అయితే, బాగ్దాదీ తర్వాత ఐసిస్ పగ్గాలు చేపట్టేది అబు ఇబ్రహీమ్ అల్ హష్మీ అల్ ఖురేషీ అని వెల్లడైంది. ఐసిస్ ఓ ప్రకటనలో ఈ విషయం తెలియజేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఐసిస్ కు నాయకత్వం వహించబోయేది ఎవరో మాకు బాగా తెలుసు అంటూ ట్విట్టర్ లో స్పందించారు. కాగా, బాగ్దాదీ మృతిని ధ్రువీకరించిన ఐసిస్ వర్గాలు తమ ప్రతీకార దాడులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అమెరికాను హెచ్చరించాయి.

Donald Trump
Baghdadi
ISIS
USA
  • Error fetching data: Network response was not ok

More Telugu News