Jagan: జగన్ ప్రతివారం కోర్టుకు హాజరైతే ప్రభుత్వంపై భారం పడుతుందనడం నమ్మశక్యంగా లేదు: సీపీఐ రామకృష్ణ

  • కోర్టులో వ్యక్తిగత మినహాయింపు కోరిన జగన్
  • జగన్ పిటిషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం
  • జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనన్న సీపీఐ రామకృష్ణ

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కల్పించాలంటూ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు.  జగన్ ప్రతివారం కోర్టుకు హాజరైతే ప్రభుత్వంపై భారం పడుతుందనడం నమ్మశక్యంగా లేదని అన్నారు. కేసుల వ్యవహారంలో జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. జగన్ తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకోవాలని వ్యాఖ్యానించారు. కాగా, రామకృష్ణ రాష్ట్రంలోని బోట్లు, లాంచీల డ్రైవర్లు, సరంగుల లైసెన్సుల పొడిగింపు కోసం చర్యలు చేపట్టాలని కోరుతూ సీఎం జగన్ కు లేఖ రాశారు.

Jagan
CBI
CPI Ramakrishna
  • Loading...

More Telugu News