Pegasus: వాట్సాప్ లో చొరబడిన స్పైవేర్... హ్యాకింగ్ బారిన ప్రముఖుల ఫోన్లు

  • ఇజ్రాయెల్ లో పురుడుపోసుకున్న 'పెగాసస్' స్పైవేర్
  • వాట్సాప్ భద్రతను అపహాస్యం చేసిన సైబర్ భూతం
  •  ప్రపంచవ్యాప్తంగా 1400 మంది ప్రముఖులకు తప్పని 'పెగాసస్' బెడద

వాట్సాప్ ను సమాచార భద్రత పరంగా అత్యుత్తమ ప్లాట్ ఫామ్ గా భావిస్తుంటారు. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సెక్యూరిటీతో చాటింగ్ తదితర కార్యకలాపాలు ఎంతో సురక్షితమని వాట్సాప్ ఇప్పటివరకు చెబుతూ వచ్చింది. అయితే, వాట్సాప్ కూడా హ్యాకింగ్ కు అతీతం కాదని తేలింది. ఇజ్రాయెల్ లో ఉద్భవించిన 'పెగాసస్' అనే స్పైవేర్ వాట్సాప్ లో ప్రవేశించిందని, ప్రపంచవ్యాప్తంగా 1400 మంది జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తల ఫోన్లలో ఇది తిష్టవేసిందని స్వయంగా వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది.

వాట్సాప్ లో 'పెగాసస్' స్పైవేర్ ను తాము ఈ ఏడాది వేసవిలోనే గుర్తించి అడ్డుకున్నామని, వెంటనే ప్రభావిత వ్యక్తులకు సమాచారం అందించామని వాట్సాప్ వెల్లడించింది. వాట్సాప్ లో వీడియో, ఆడియో కాల్స్ వ్యవస్థ అయిన వీఓఐపీ స్టాక్ లో ఉన్న లోపం హ్యాకర్ల పాలిట వరమైంది. ఈ లోపాన్ని ఆధారంగా చేసుకుని హ్యాకర్లు 'పెగాసస్' స్పైవేర్ ను వాట్సాప్ లోకి చొప్పించగలిగారు.

ఈ స్పైవేర్ ఒక్కసారి ఫోన్ లో ప్రవేశించాక కీలక సమాచారాన్నంతా నిర్దేశిత సర్వర్ కు పంపుతుంది. వాట్సాప్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటుండడం ద్వారా స్పైవేర్ ప్రభావం నుంచి బయటపడొచ్చని సైబర్ నిపుణులు అంటున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News