Maharashtra: సర్కారు ఏర్పాటుపై తొలగని ప్రతిష్టంభన... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పదంటున్న బీజేపీ నేత
- మహారాష్ట్రలో సీఎం పీఠం కోసం బీజేపీ, శివసేన కీచులాట
- ఫలితాలు వెలువడి వారం గడుస్తున్నా ఏర్పాటు కాని ప్రభుత్వం
- మళ్లీ చర్చలు జరుపుతామన్న సుధీర్ ముంగంటివార్
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులైనా ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. బీజేపీ, శివసేన మధ్య సీఎం పీఠం విషయంలో వివాదం తలెత్తడంతో సమస్య అపరిషృతంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత సుధీర్ ముంగంటివార్ (ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఆర్థికమంత్రి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. నవంబరు 7లోగా సమస్య ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నామని, అప్పటికీ సఖ్యత కుదరకపోతే రాష్ట్రపతి పాలన తప్పదని అన్నారు. అయితే, దీపావళి కారణంగా బీజేపీ, శివసేన మధ్య చర్చలు నిదానించాయని, మళ్లీ చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళతామని ముంగంటివార్ వెల్లడించారు.